బంగారం ధరలకు మళ్లీ రెక్కలు – రూ.34 వేల మార్క్‌ను దాటిన వైనం

0
25
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – బిజినెస్‌ డెస్క్‌
దేశీయంగా గిరాకీ పెరగడంతోపాటు బలమైన అంతర్జాతీయ సంకేతాలతో బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి.దీంతో దేశీయ మార్కెట్లో పసిడి ధర రూ. 34వేల మార్క్‌ను దాటింది. గురువారం ఒక్కరోజే రూ.280 పెరగడంతో 10 గ్రాముల పుత్తడి రూ. 34,020 పలికింది.

అటు వెండి ధర కూడా నేడు దూసుకెళ్లింది.నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి కొను గోళ్లు వెల్లువెత్తడంతో ఇవాళ ఒక్క రోజే ఏకంగా రూ.710 పెరిగింది. దీంతో బులియన్‌ మార్కెట్లో కేజీ వెండి ధర రూ.39,070కు చేరింది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధ ఆందోళనలతో అంతర్జాతీ యంగా భౌగోళిక అనిశ్చితులు నెలకొన్నాయి.

దీంతో బంగారంలో పెట్టుబడులు పెట్టడమే శ్రేయస్కరమని మదుపర్లు భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో గత నాలుగు వారాలుగా ఈ లోహం ధర పెరుగుతూ పోతోంది. తాజాగా న్యూయార్క్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర ఐదేళ్ల గరిష్ఠానికి చేరి 1,386 డాలర్లు పలికింది.