ఆటోను ఢీకొన్న లారీ – నలుగురు మృతి

0
218
advertisment

మనఛానల్ న్యూస్ – తెలంగాణ డెస్క్
శుక్రవారం ఉదయం తెలంగాణలో సూర్యాపేట జిల్లా చిలుకూరు వద్ద ఘెర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలుకూరు ప్రధాన రహదారిపై ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. చిల్కూరు మండలం జాంపహాడ్‌లోని దర్గాను దర్శించుకొని ఓ షేర్ ఆటోలో తిరిగి వెెళ్లుతున్న ఓ కుటుంబం ఆటోలు తిరిగి వస్తుండగా చిల్కూరు మిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీ ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు గాయ పడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులంతా మహబూబాబాద్ జిల్లా కొరరి మండలం చింతపల్లి గ్రామస్థులుగా గుర్తించారు.