బెంగాల్‌లో మరోసారి చెలరేగిన ఘర్షణలు – ఇరువురు మృతి

0
66
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తల పరస్పర దాడులతో ఇటీవల రణరంగంగా మారిన పశ్చిమ బెంగాల్‌లో మరోసారి ఘర్షణలు చోటుచేసుకున్నాయి.కోల్‌కతా సమీపంలోని భట్‌పరా ప్రాంతంలో గురువారం ఉదయం రెండు వర్గాలకు మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు.మరో ముగ్గురు గాయపడ్డారు.

భట్‌పరా ప్రాంతంలో ఈ ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు పరస్పరం తుపాకులతో కాల్పులు జరిపారు.నాటు బాంబులు విసురుకున్నారు. ఈ ఘటనలో పానీపూరీ విక్రయించే రాంబాబు షా అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

గాయపడిన మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా భట్‌పరాలో కొత్తగా నిర్మించిన పోలీస్‌ స్టేషన్‌ను బెంగాల్‌ డీజీపీ నేడు ప్రారంభించాల్సి ఉంది.డీజీపీ మార్గమధ్యంలో ఉండగానే ఈ ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పోలీస్‌ స్టేషన్‌ ప్రారంభోత్సవాన్ని నిలిపివేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు. భట్‌పరాలో రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ బలగాలు మోహరించాయి.