పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్‌

0
26
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – పశ్చిమ గోదావరి
ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్‌ గురువారం సందర్శించా రు.ముఖ్యమంత్రి హోదాలో పోలవరాన్ని సందర్శించడం ఆయనకిదే ప్రథమం.ముందుగా హెలికాఫ్టర్‌తో ఏరియల్‌ సర్వే నిర్వహించారు.

ఇందులో భాగంగా ఇప్పటివరకు ఎంతమేర పనులు జరిగాయి, పూర్తిచేయడానికి చేపట్టాల్సిన చర్యలపై ఆయన అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. అదేవిధంగా పనులు వేగవంతం చేయడానికి అధికారులు మరింత కృషి చేయాలని సూచించారు.ముందుగా పశ్చిమ జిల్లాలో ఉండిలో వైఎస్సార్‌ సీపీ నేత కొయ్యే మోషేన్‌రాజు కుమారుని వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వ దించారు.

ఉప ముఖ్యమంత్రి,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని,గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ రంగనాథ రాజు, ఎంపీ రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్, పుప్పాల వాసుబాబు, ప్రసాద రాజు, దూలం నాగేశ్వర రావు, మంతెన రామరాజు, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణ రాజు,జిల్లా కలక్టర్ రేవు ముత్యా ల రాజు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోయ్యే మోషన్ రాజు,జిల్లా యూత్ అధ్యకుడు యోగేంద్ర బాబు,డీఐజీ అబ్దుల్ సత్తార్ ఖాన్‌లు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు.