పెళ్లివ్యాన్‌ నదిలో పడిన దుర్ఘటనలో ఏడుగురు చిన్నారుల గల్లంతు

0
17
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
పెళ్లికి వెళ్లి తిరిగి వస్తోన్న ఎస్‌యూవీ ఒకటి అదుపు తప్పి కాలువలోకి పడిపోయింది.ఉత్తర్ ప్రదేశ్‌లో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో కొంతమందిని రక్షించగా,మరికొంతమంది చిన్నారులు గల్లంతయ్యారు. దీంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో పడిపోయారు. లక్నోలో గురువారం ఉదయం ఘటన చోటు చేసుకుంది.

పోలీసులు అందించిన స​మాచారం ప్రకారం 29 మంది వేళ్లి వేడుకు హాజరైన తిరిగి వస్తుండగా వీరు ప్రయాణిస్తోన్న వాహనం నగ్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని పట్వా ఖేరా వద్ద ఇందిర కాలువలో పడిపో యింది.గజ ఈతగాళ్లు 22 మందిని రక్షించగా మిగిలిన ఏడుగురు చిన్నారులు కనిపించకుండా పోయా రు.ఎన్‌డీఆర్‌ఆఫ్‌ దళాలు వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నాయని సీనియర్‌ పోలీసు అధికారి ఎస్‌కే భగత్‌ తెలిపారు.

కాలువలో వలలను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించామన్నారు.వీరితోపాటు లక్నో నగరపాలక సంస్థ అధికారులు,పోలీసులు ఘటనాస్థలం వద్దే వుండి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు.మరోవైపు ఈ ఘటనపై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.