నిర్మాణాత్మక భారత్‌ కోసం కృషి చేద్దాం – రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

0
15
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
నిర్మాణాత్మక భారత్‌ కోసం కలసికట్టుగా కృషి చేద్దామని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వెల్లడించారు. గురు వారం పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఓం బిర్లాను అభినం దించారు.

ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల సంఘాన్ని అభినందిం చారు.ఇంత పెద్ద దేశంలో శాంతియుతంగా ఎన్నికలు జరగడం అభినందనీయం.ఈ ఎన్నికల్లో 61 కోట్ల మందికి పైగా ఓటు హక్కు వినియోగించుకుని రికార్డు సృష్టించారు.యువత పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొంది.

తమ తీర్పును స్పష్టంగా వెల్లడించారు.2014 నుంచి కొనసాగుతున్న ప్రభుత్వానికి మరోసారి అవకాశ మిచ్చారు.17వ లోక్‌సభలో చాలా మంది ఎంపీలు కొత్తవారే. అంతేగాక, మహిళా సభ్యుల సంఖ్య కూడా పెరిగింది.నవ భారత నిర్మాణానికి ఇదే నిదర్శనమని కోవింద్‌ అన్నారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగంలోని హైలెట్స్‌

  • ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తుంది. ‘‘సబ్‌ కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌.. సబ్‌ కా విశ్వాస్‌’’(అందరితో కలిసి.. అందరికీ వికాసం.. అందరి విశ్వాసం) కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది.
  • బహిరంగ, అంతర్గత ముప్పుల నుంచి దేశానికి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది.
  • 2022 నాటికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తవుతుంది. నవ భారత నిర్మాణం కోసం ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుంది.
  • రైతుల, జవాన్ల కుటుంబాలకు అండగా నిలుస్తాము.
  • నీటి సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుంది. జల్‌ శక్తి మంత్రిత్వ శాఖే ఇందుకు నిదర్శనం
  • ప్రజలందరి జీవన స్థితిగతులు మారుస్తాం. గ్రామీణ ప్రాంతాలకు పూర్థిస్థాయి సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. యువతకు మంచి విద్యావకాశాల కల్పనకు మరిన్ని కోర్సులు తీసుకొస్తాం. యువ భారత్‌ స్వప్నాలు సాకారం చేస్తాం.
  • నివాస, వైద్య సదుపాయాలను అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నాం. సాధికారతతోనే పేదరికాన్ని నిర్మూలించగలం.
  • రైతులు, చిన్న వ్యాపారుల భద్రత కోసం ప్రభుత్వం పింఛను పథకం తీసుకొచ్చింది.