మదనపల్లిలో ప్రభుత్వ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ

0
53
advertisment

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం లోని ప్రభుత్వ ఆదర్శ బాలికల ప్రాథమిక పాఠశాల లో బుదవారం ఉదయం మదనపల్లి ఎం.ఇ.ఓ కుడుముల ప్రభాకర రెడ్డి చేతుల మీదగా ప్రభుత్వ ఉచిత పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో స్థానిక సి.ఆర్.సి ప్రధానోపాధ్యాయురాలు ఎం.ఆర్. పద్మావతి, సి.ఆర్.పి రెడ్డిశేఖర్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మంగే నాయక్, మునిగోటి శ్రీనివాస శర్మ, పులిగొండ్ల శ్రీరంజనీ ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈసందర్బంగా పాఠశాల పిల్లలకు ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, షూలు సాక్సులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమామనికి హాజరైన ఎం.ఇ.ఓ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని, అమ్మఒడి పథకం ద్వారా ప్రతి తల్లికీ వచ్చే ఏడాది జనవరి26 నాటికి రూ. 15,000/- లను అందిస్తుందని తెలిపారు. తొలుత అక్షరాభ్యాస కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బత్తల కవిత, కంబాల వెంకట్రమణ, ఊకా సుమతి, మూడే సుమిత్రమ్మ, అమృతవల్లి పాల్గొన్నారు.