నేడు విజయవాడకు తెలంగాణ సీఎం కేసీఆర్‌

0
16
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ మధ్యాహ్నం విజయవాడకు వెళ్లనున్నారు.ఆయన బేగంపేట విమానాశ్రయం నుండి విజయవాడకు మధ్యాహ్నం 1-25 గంటలకు చేరుకోనున్నారు.అక్కడ నుండి ఆయన 1-45 గంటలకు కనకదుర్గమ్మను దర్శించుకుంటారు.

అనంతరం అక్కడి నుండి 2-30 గంటలకు గేట్‌వే హోటల్‌ చేరుకుని విశ్రాంతి తీసుకోనున్నారు.గేట్‌ వే హోటల్‌ నుండి ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి నివాసానికి చేరుకోకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వై.ఎస్‌.జగన్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు.

ఇందులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డితో విభజన సమస్యలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. తదనంతరం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సాయంత్రం 5 గంటలకు కృష్ణానది తీరాన జరిగే ఉత్తారాధికారదీక్షకు హాజరుకానున్నారు.సీఎం కేసీఆర్‌ తిరిగి ఈ రోజు రాత్రికి హైదరాబాద్‌కు చేరుకుంటారు.