షాంఘై సహకార సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోదీ

0
41
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – ఇంటర్నేషనల్‌ డెస్క్‌
కిర్గిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో జరుగుతున్న షాంఘై సహకార సదస్సులో శుక్రవారం మోదీ పాల్గొని ప్రసంగించారు.ఉగ్రవాదానికి మద్దతిస్తూ ఉగ్రవాదులకు ఆర్థిక సహకారం అందించే దేశాలు జవాబుదారీగా ఉండాలని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని, దాన్ని అరికట్టాలని మోదీ అన్నారు.

ఉగ్రవాదులకు మద్దతిచ్చే దేశాలను బహిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.దీంతో దాయాది దేశం పాకిస్థాన్‌కు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఎదుటే పరోక్షంగా గట్టి హెచ్చరికలు చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో ఎస్‌సీవో దేశాలు పరస్పర సహకారం అందించుకోవాలని కోరారు. ఉగ్రవాద రహిత సమాజం కోసం భారత్‌ కట్టుబడి ఉందన్నారు.

ఎస్‌సీవోలో భారత్‌ రెండేళ్లుగా శాశ్వత సభ్యదేశంగా ఉందని, ఈ రెండేళ్లలో ఎస్‌సీవో చేపట్టే అన్ని కార్యక్రమాలకు సానుకూల సహకారం అందించామని మోదీ తెలిపారు. అంతర్జాతీయ వేదికపై ఎస్‌సీవో విశ్వసనీయతను పెంచేందుకు మున్ముందు మరింత సహకారం అందిస్తామన్నారు.

ఈ సందర్భంగా శ్రీలంకలో ఉగ్రదాడిని గురించి కూడా మోదీ ప్రస్తావించారు. అక్షరాస్యత, సంస్కృతి సంప్రదాయాలు సమాజంలో సానుకూల దృక్పథాన్న పెంచుతాయి. యువతలో తీవ్రవాద భావజాల వ్యాప్తిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని మోదీ అన్నారు.