శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం

0
34
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – తిరుమల
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆల యంలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది.

శ్రీవారి సర్వదర్శనానికి భక్తులతో వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్‌లు నిండిపోయాయి.వైకుంఠం వెలు పల కిలోమీటర్ మేర భక్తులు వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 20 గంటల సమయం, నిర్దేశిత దర్శన టోకెన్లు ఉన్న భక్తులకు 4 గంటల సమయం పడుతోంది.

నిన్న శ్రీవారిని 86,173 మంది భక్తులు దర్శించుకున్నారు.38,036 మంది భక్తులు తలనీలాలు సమ ర్పించుకున్నారు.నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.75 కోట్లు.