మళ్లీ పరుగులు పెడుతున్న పసిడి ధరలు

0
62

మనఛానల్‌ న్యూస్‌ – బిజినెస్‌ డెస్క్‌
కొనుగోళ్ల అండ, అంతర్జాతీయ సానుకూలతతో దేశీయ మార్కెట్లలో బంగారం ధరకు మళ్లీ రెక్కలొచ్చా యి. క్రమక్రమంగా పెరుగుతూ పసిడి ధర రూ. 34వేలకు చేరువైంది. శుక్రవారం ఒక్క రోజే రూ.300 పెరగడంతో బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల పుత్తడి రూ. 33,870 పలికింది.

అటు వెండి కూడా నేడు బంగారం దారిలోనే పయనించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో నేడు ఒక్క రోజే రూ.550 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 38,400గా ఉంది.

మధ్యప్రాశ్చ్య దేశాల్లో నెలకొన్న భౌగోళిక అనిశ్చితులు, అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధ ఆందోళ నల నేపథ్యంలో బంగారంలో పెట్టుబడులు పెట్టడమే శ్రేయస్కరమని మదుపర్లు భావించినట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,358 అమెరికన్‌ డాలర్లు పలికింది.