బి.కొత్తకోట ఎంఈవో ఆధ్వర్యంలో ‘‘అక్షరం’’ కార్యక్రమం

0
37
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – బి.కొత్తకోట
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రాజన్న బడిబాట’లో భాగంగా ‘‘అక్షరం’’ కార్యక్రమాన్ని చిత్తూరుజిల్లా బి.కొత్తకోట మండలం కాండ్లమడుగు ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ఘనంగా నిర్వ హించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి రెడ్డిశేఖర్‌ హాజరయ్యారు.

ముందుగా 1వ తరగతిలో చేరిన కొత్త విద్యార్థులకు ఆయన చేతులతో ‘‘అక్షరాభ్యాసం’’ చేయించారు.ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన జరుగు తున్నదన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నద న్నారు. అనంతరం పాఠశాలకు రూ.15 వేలు విలువ చేసే నోటుపుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్‌ను జీ.వి.శ్రీనివాసరావు అనే దాత వితరణ చేశారు.

వీటిని విద్యార్థులకు ఎంఈవో రెడ్డిశేఖర్‌ పంపిణీ చేశారు. పేదవిద్యార్థుల విద్యాభివృద్ధికి సహకరించిన జీ. వి.శ్రీనివాసరావు దాతృత్వాన్ని పలువురు కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఎం.పి.టి.సి బి.ఈశ్వరమ్మ సుబ్బారెడ్డి,మాజీ జెడ్‌.పి.టి.సి కె.శ్రీనివాసులు,ప్రధానోపాధ్యాయుడు బి.రమణప్ప,సీఆర్‌పి ఇ.శ్రీనివాసు లు తదితరులు పాల్గొన్నారు.