ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను గాడినపెడతాం – సీఎం వై.ఎస్‌.జగన్‌ స్పష్టం

0
94
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – అమరావతి
గతి తప్పిన పాఠశాల వ్యవస్థను తిరిగి గాడినపెడతామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం తాడేపల్లి మండలం పెనమాకలోని వందేమాతరం హైసూల్క్‌లో విద్యా ర్థులకు జరిగే సామూహిక అక్షరాభాస్య కార్యక్రమంలో పాల్గొన్నారు.

పిల్లల భవిష్యత్‌కు భరోసా ఇచ్చేటట్లు విశ్వాసాన్ని కలిగించటానికి ‘ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి’ అనే నినాదంతో రాజన్నబాట నిర్వహిస్తున్నారు. పిల్లలు పలక, బలపం పట్టినప్పటి నుంచి తమ ఆకాంక్షల ను వారికి రెక్కలుగా కడతారు తల్లిదండ్రులు.బిడ్డల భవిష్యత్‌పై ఎన్నో రంగురంగుల కలలు కంటారు.ఆ కలల సాకారానికి కళ్లను మభ్యపెట్టే కార్పొరేట్‌ చదువులే మార్గమని నేడు భ్రమ పడుతున్నారు.

దీనికి సర్కారు బడుల్లో వసతులలేమి కూడా కారణంగా చెబుతున్నారు.ఈ నేపథ్యంలో తడబడిన ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంకణం కట్టుకున్నారు. సర్కారు బడిని వసతుల గుడిగా మార్చేందుకు నిర్ణయించుకున్నారు.యూనిఫాం నుంచి నోబ్యాగ్‌ డే వరకు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు.

రాజన్న బడిబాట పేరిట విద్యార్థుల బంగారు భవితకు రాచబాట వేస్తూ ప్రభుత్వ బడులపై తల్లిదండ్రులకు నమ్మకం పెంచుతున్నారు.శుక్రవారం తాడేపల్లి మండలం పెనుమాక ప్రభుత్వ పాఠశాలలో పిల్లలతో అక్షరాభ్యాసం చేయించి అమ్మ ఒడిని చల్లగా దీవించనున్నారు.

ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, హోంమంత్రి సుచరిత, ఎంపీ నందిగం సురేష్‌, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.