పాక్‌తో పోరుకు సిద్ధంగా ఉన్నాం – భారత్‌ కెప్టెన్‌ కోహ్లీ

0
50
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
ప్రపంచకప్‌లో తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడేందుకు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యామని టీ మిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వెల్లడించాడు.మేం మైదానంలోకి వెళ్లగానే అంతా ప్రశాంతంగా మారి పోతుంది. ఒత్తిడి, ఆందోళన లాంటి భావోద్వేగాలు కొత్తగా ఆడేవారిపై ప్రభావం చూపుతాయి.

మేం నైపుణ్యం కలిగిన ఆటగాళ్లం. వాటిపైనే మేం దృష్టిసారిస్తాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇద్దరి మధ్యా గట్టి పోటీ ఉంది. వారితో ఆడేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రపంచకప్‌ లాంటి మెగా ఈవెంట్లలో ఆడటం మాకు గర్వకారణమని కోహ్లీ పేర్కొన్నాడు. మాంచెస్టర్‌ వేదికగా ఆదివారం భారత్‌ X పాక్‌ మధ్య రసవత్తర పోరు జరగనుంది.

ఈ మ్యాచ్‌కోసం ఇరు దేశాల అభిమానులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.కాగా ఈ టోర్నీలో టీమిండియా రెండు వరుస విజయాలు సాధించగా న్యూజి లాండ్‌తో మ్యాచ్‌ రద్దైంది. దీంతో ఐదు పాయింట్లతో భారత్‌ మూడోస్థానంలో కొనసాగుతోంది.