చంద్రబాబుపై హైకోర్టులో పసుపు -కుంకుమ కేసు

0
73
advertisment

మనఛానల్ న్యూస్ – అమరావతి
శుక్రవారం ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికలలో లబ్ధికోసం చంద్రబాబు ప్రభుత్వం ఓటర్లకు నేరుగా పసుపు -కుంకుమ పథకం కింద నేరుగా డబ్బులు ఇచ్చి ప్రలోభాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ రిపబ్లిక్ పార్టీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. మహిళా ఓటర్లు, రైతులను ఆకర్షించడానికి ఎన్నికలకు ముందు ఓటర్ల అకౌంట్‌లో వేసిన పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ నిధులతో వారిని ప్రభావం చేశారని, ఇది ప్రభుత్వ డబ్బుతో ఓటర్లను కొనుగొలు చేయడమేనని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.ఎన్నికల వేళ కోడ్ అమలులో ఉండగా… ఓటర్లకు ప్రభుత్వ సొమ్మును వ్యక్తిగత అకౌంట్లలో వేయడం నేరమని పేర్కొన్నారు. ఈ పసుపు-కుంకమ, రైతు సుఖీభవ పథకం కింద ఇచ్చిన సొమ్మును చంద్రబాబు వ్యక్తిగత వ్యయం కింద లెక్కించి, ఆయన నుంచి వసూలు చేయాలని పిటిషన్‌లో కోరారు. హైకోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించి ఈ నెల 18కి వాయిదా వేసింది.