గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం – ముగ్గురు దుర్మరణం

0
12
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – గుంటూరు
అతివేగం అనర్థం తెచ్చిపెట్టింది.మితిమీరిన వేగంతో వెళ్తున్న స్కార్పియో వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలవ్వగా,మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు జిల్లా వినుకొండ మండలం విటంరాజుపల్లె వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఈఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖ జిల్లాకు చెందిన ప్రవీణ్‌కుమార్‌, రామకృష్ణ, వెంకటేశ్‌, కుమారస్వామి స్కార్పియోలో ప్రకాశం జిల్లా మార్కాపురం వైపు వెళుతున్నారు.విటంరాజుపల్లె వద్దకు చేరుకునేసరికి వీరి వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చింతచెట్టును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ప్రవీణ్‌కుమార్‌, రామకృష్ణ, వెంకటేశ్‌లు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయ పడిన కుమారస్వామిని చికిత్స నిమిత్తం గుంటూరు ఆసుపత్రికి తరలించారు. వినుకొండ సీఐ ఎం. సుబ్బారావు ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.