కర్నాటకలో కుమారస్వామి మంత్రివర్గం విస్తరణ – ఇద్దరికి అవకాశం

0
80
advertisment

మనఛానల్ న్యూస్ – బెంగళూరు
కర్నాటకలో ముఖ్యమంత్రి కుమారస్వామి శుక్రవారం తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. లోకసభ ఎన్నికలలో జె.డి.యు, కాంగ్రెస్ పార్టీలు ఘెరంగా దెబ్బతిన్న అనంతరం సంకీర్ణ ప్రభుత్వంలో అసంతృప్తి జ్వాలలు చెలరేగుతాయనే అనుమానం నేపథ్యంలో కుమారస్వామి తన పార్టీకి చెందిన ఇద్దరికి మంత్రి వర్గంలో అవకాశం కల్పించారు. ఎం.ఎల్.ఏలు ఆర్.శంకర్, జె.నగేష్ శుక్రవారం బెంగళూరు లోని రాజభవన్ లో గవర్నర్ వారిచేత ప్రమాణ స్వీకారం చేశారు. 225 మంది సభ్యులున్న కర్నాటక అసెంబ్లీలో గత ఎన్నికలలో బిజెపికి 105 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పుటికి సరైన మెజార్టీ లేకపోవడంలో జెడియు(37), కాంగ్రెస్ పార్టీ(79)లు సంయుక్తంగా 116 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇటివల జరిగిన లోకసభ ఎన్నికలలో కాంగ్రెస్, జెడియులు తీవ్రంగా దెబ్బతినడంతో ఎం.ఎల్.ఏలు పట్టుజారి ప్రభుత్వం పడిపోయే అవకాశాలు అధికంగా ఉన్నందున కుమారస్వామి ముందస్తుగా ఈచర్యలు తీసుకొంది.