ఆవులపల్లి పాఠశాలలో అక్షరాబ్యాసం కార్యక్రమం

0
100
advertisment

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం ఆవులపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో రాజన్న బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అక్షరాభ్యాసం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇన్-చార్జ్ హెచ్.ఎం. ఆర్.వి.రమణ, ఉపాధ్యాయులు మురళి, వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గోన్నారు. ఇన్ – చార్జీ హెచ్.ఎం.రమణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించడం వల్ల విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్ ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు అర్హతలు, విద్యాబోధనలో అనుభవం ఉండడం వల్ల విద్యార్థులకు విషయ పరిజ్ఞానం పెరుగుతుందన్నారు. తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల మోజులో పడి ఓ వైపు ధనం పోగొట్టుకోవడమేగాక, మరో వైపు యాంత్రిక జీవనానికి అలవాటు పడి భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతోందని అన్నారు.