ఆప్ఘనిస్తాన్ లో ఆత్మహుతి దాడులలో 11 మంది మృతి

0
27
Security personnel inspect the site of a suicide attack on the outskirts of Jalalabad, Afghanistan, Thursday, June 13, 2019. Afghan officials said the suicide bomber attacked a police vehicle killing several police and civilians. The attack in eastern Jalalabad, the capital of Nangarhar province also wounded another 11 people. (AP Photo)
advertisment

మనఛానల్ న్యూస్ – ఇంటర్నేషనల్ డెస్క్
ఆప్ఘనిస్తాన్ లో శుక్రవారం ఐఎస్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పోలీసు చెక్ పోస్టు లక్ష్యంగా ఆత్మహుతి బాంబుదాడులు చేయడంతో 11మంది మరణించారు.మరో ముగ్గురు పౌరులు గాయపడ్డారు. తాలిబాన్ సమస్య పరిష్కారం తర్వాత ఇటివల కాలంలో ఆత్మహుతి దాడుల వల్ల అనేక మంది మృత్యువాత పడుతున్నారు. శుక్రవారం నాగహర్ ప్రావిన్స్ లో జలీలాబాద్ లో ఈ దుర్ఘటన సంభవించింది. ఆప్ఘనిస్తాన్ లో అమెరికా శాంతి దూత తాలిబన్లు మరియు ప్రభుత్వానికి మధ్య పలు విషయాలలో ఒప్పందాలు కుదిర్చి శాంతికి ప్రయత్నిస్తున్నారు.

అయినప్పుటికి హింస కొనసాగుతోంది. శాంతి కోసం తాలిబన్లుతో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా అనేక సంవత్సరాలుగా ఆప్ఘనిస్తాన్ జైళ్లలో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలను ప్రభుత్వం విడుదల చేసింది.ఇందులో అనారోగ్యంతో బాధపడుతున్న వారు, వయసు మీద పైబడిన 490 మంది ఖైదీలను విడుదల చేశారు. రంజాన్ మాసం పురస్కరించుకొని 887 మంది తాలిబన్ ఖైదీలను జూన్ చివరినాటికి విడుదల చేస్తామని ఆప్ఘనిస్తాన్ అధ్యక్షులు ఆసిఫ్ జర్థారి ప్రకటించారు.ఆప్ఘనిస్తాన్ లో అమెరికా శాంతి దూత ఖలిజాద్ త్వరలో ఖతర్ కు వెళ్లి తాలిబన్లతో చర్చలు జరపనున్నారు. అలాగే ఆప్ఘనిస్తాన్ లో ఉన్న అమెరికా సైనిక దళాలు ఇక్కడ శాంతి ఏర్పడిన అనంతరం తమ దళాలను ఉప సంహరించుకొంటామని పేర్కొన్నారు.