అమిత్ షా తో ముగిసిన ఏపి సి.ఎం.వై.ఎస్.జగన్ భేటి

0
222
advertisment

మనఛానల్ న్యూస్ – న్యూఢిల్లీ
ఏపి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా అధికారికంగా వై.ఎస్.జగన్ మెహన్ రెడ్డి శుక్రవారం న్యూఢిల్లీకి చేరుకొన్నారు. ఈసందర్భంగా ఆయన బిజెపి ఛీప్,కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి ఎపి సమస్యలపై ప్రస్తావించారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా ఇవ్వాలని జగన్ అమిత్ షా ను కోరారు. అలాగే రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించాలని ఆయన అమిత్ షాకు గుర్తుచేశారు. వై.ఎస్.జగన్ వెంట ఎంపిలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, రఘరామకృష్ణంరాజు, వై.వి సుబ్బారెడ్డి తో పాటు వైకాపా ఎం.పిలు పాల్గోన్నారు. శనివారం జరిగే నితిఅయోగ్ సమావేశంలో జగన్ ను పాల్గోననున్నారు