రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు..

0
351

మనఛానల్‌ న్యూస్‌ – హెల్త్‌ డెస్క్‌
ప్రతి ఏడాది లాగా ఈ ఏడాది భానుడి తన ప్రతాపాన్ని చూపించాడు.అధికవేడితో ప్రజలు సతమతమ య్యారు. భానుడు ఇకపై చల్లగా మారనున్నాడు. మరో వారం రోజుల్లో వర్షాలు పడనున్నాయి. దీంతో వాతావరణం పూర్తిగా మారిపోనుంది. అయితే వర్షాకాలం సీజన్ ఆరంభంతోనే చాలా మందికి వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. కనుక ఇప్పటి నుంచే అలాంటి వారు శరీర రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలను తీసుకోవాలి.

రోగనిరోధకశక్తిని పెంచే ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం

  • విటమిన్ సి ఎక్కువగా ఉండే గ్రేప్‌ఫ్రూట్, నారింజ పండ్లు, నిమ్మకాయలు, కివీలు, క్యాప్సికం తదితర ఆహారాలను నిత్యం తీసుకోవడం ద్వారా మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.ముఖ్యంగా సీజన్ మారినప్పుడు దగ్గు, జలుబు రాకుండా ఉంటాయి.
  • అల్లం, వెల్లుల్లిని నిత్యం మన కూరల్లో వేస్తుంటాం. అయితే వీటిని నిత్యం పచ్చిగా తినడం అలవాటు చేసుకోవాలి. దీంతో శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
  • పాలకూర, పెరుగులలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని రోజూ తీసుకుంటే శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.
  • బాదంపప్పుల్లో విటమిన్ ఎ, సి, ఇలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణను అందిస్తాయి.
  • పసుపు, గ్రీన్ టీ, బొప్పాయి పండు, కివీలు, చికెన్ సూప్, పొద్దుతిరుగుడు విత్తనాలు తదితర ఆహారాలను తరచూ తీసుకున్నా శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.