రాజ్యసభపక్షనేతగా థావర్‌ చంద్‌ గహ్లోత్‌ నియామకం

0
14
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
పెద్దలసభ అయిన రాజ్యసభ పక్షనేతగా ఉన్న భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ స్థానంలో కేంద్రమంత్రి థావర్‌చంద్‌ గహ్లోత్‌ నియమితులయ్యారు. ఇప్పటి వరకు రాజ్యసభ పక్షనేతగా వ్యవహరించిన అరుణ్‌జైట్లీ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా భాజపా అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

గత కొంతకాలంగా అరుణ్‌జైట్లీ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. థావర్‌ చంద్‌ గహ్లోత్‌ 2014 నుంచి మోదీ కేబినెట్‌లో కీలక నేతగా ఉన్నారు. ప్రస్తుతం సామాజిక న్యాయం, సాధికారత శాఖను పర్యవేక్షిస్తున్నారు.థావర్ చంద్‌ గహ్లోత్‌ 1996 నుంచి 2009 వరకు షాజాపూర్‌ నుంచి లోక్‌ సభకు ప్రాతినిధ్యం వహించారు. 2012, 2018లో ఎగువసభకు ఎన్నికయ్యారు.