బీహార్‌లో విషాదం – 36 మంది పిల్లలు మృతి

0
4
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
మెదడువాపు వ్యాధి లక్షణాలతో 48 గంటల వ్యవధిలో 36 మంది పిల్లలు మృతిచెందిన విషాదకర సంఘటన బీహార్‌లోని ముజఫరాబాద్‌లో చోటుచేసుకుంది.ఇదే వ్యాధితో మరో 133 మంది చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ చిన్నారుల్లో ఎక్కువ శాతం హైపోగ్లైసీమియా (రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోవడం) వల్లే చనిపోతున్నారని వైద్యులు వెల్లడించారు.

జిల్లాలోని శ్రీ కృష్ణ వైద్య కళాశాల సూపరింటెండెంట్‌ ఎస్‌కే సాహి దీనిపై మాట్లాడారు. ప్రస్తుత పరిస్థి తులపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. 90 శాతం పిల్లలు హైపోగ్లైసీమియా కారణంగా చనిపోతున్నారని ఆయన తెలిపారు.జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వాసుప త్రులన్నీ మెదడు వాపు లక్షణాలున్న చిన్నారులతో నిండిపోయాయి.

అధిక ఉష్ణోగ్రతతో జ్వరం రావడం, మానసిక ఆందోళన, తరచుగా ఉద్వేగానికి లోనవడం, కోమా వంటికి ఈ వ్యాధి లక్షణాలు. ఇందులో చాలా మంది పిల్లలు మారుమూల గ్రామాలకు చెందిన వారే కావడం గమనార్హం. ఆ జిల్లాలో వేసవి కాలం వస్తే మెదడువాపు లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఈ విషయం తెలిసినప్పటికీ ప్రభుత్వాధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని చిన్నారుల తల్లిదండ్రులు వాపోతున్నారు.

పదిహేనేళ్లలోపు పిల్లలకు వేసవిలో ఈ వ్యాధి రావడంతో అక్కడ శిశు మరణాల రేటు కూడా అధికంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం వల్లనో లేదా మరేదైనా కారణాల వల్ల రాత్రి పూట పిల్లలకు ఆహారం తినిపించకుండా ఖాళీ కడుపుతో నిద్రపుచ్చితే పిల్లల రక్తంలో గ్లూకోస్‌ స్థాయిలు తగ్గే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు.