చంద్రయాన్‌-2 ఫోటోలను విడుదల చేసిన ఇస్రో

0
24
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
చంద్రయాన్‌-2 ప్రయోగం కోసం పనులు విస్తృతంగా జరుగుతున్నాయి. బెంగుళూరు శాటిలైట్ ఇంటి గ్రేష‌న్ అండ్ టెస్టింగ్ సెంట‌ర్‌లో చంద్ర‌యాన్‌-2 కు సంబంధించిన ప‌రికరాలు సిద్ధం అవుతున్నాయి. చంద్ర‌యాన్‌-2కు చెందిన ఫోటోల‌ను ఇవాళ ఇస్రో రిలీజ్ చేసింది. జూలై 9 నుంచి 16 మ‌ధ్య చంద్ర‌ యాన్‌-2 మిష‌న్‌ను ప్ర‌యోగించ‌నున్నారు.

2019 సెప్టెంబ‌ర్ 6న అది చంద్రుడిపై దిగే అవ‌కాశాలు ఉన్నాయి.ఆర్బిటార్‌, ల్యాండ‌ర్‌(విక్ర‌మ్‌), రోవర్‌ (ప్ర‌జ్ఞన‌) మాడ్యూళ్ల‌ను చంద్ర‌యాన్‌2 ద్వారా లాంచ్ చేయ‌నున్నారు. జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ ద్వారా ప్ర‌యోగం జ‌రుగుతుంది.ఆర్బిటార్ ప్రొప‌ల్‌ష‌న్ మాడ్యూల్ ద్వారా మూన్ ఆర్బిట్‌లోకి శాటిలైట్ ప్ర‌వేశి స్తుంది.ఆ త‌ర్వాత ఆర్బిటార్ నుంచి ల్యాండ‌ర్ వేరుప‌డుతుంది.

చంద్రుడిపైన ఉన్న ద‌క్షిణ ద్రువంలో ల్యాండర్ దిగుతుంది. ఇక శాస్త్రీయ ప‌రీక్షల కోసం రోవ‌ర్ అక్క‌డ సంచ‌రిస్తుంది. ల్యాండ‌ర్‌, ఆర్బిటార్ మాడ్యుళ్ల‌లో ప‌రిక‌రాల‌ను శాస్త్ర‌వేత్త‌లు బిగించారు.చంద్ర‌యాన్-2 ప్ర‌యోగం ద్వారా 11 పేలోడ్స్ కూడా తీసుకువెళ్ల‌నున్నారు. ఇందులో ఇండియాకు చెందిన‌వి ఆరు, యూరోప్‌వి మూడు, అమెరికావి రెండు ఉంటాయి. 2009లో చంద్ర‌యాన్-1ను ఇస్రో ప్ర‌యోగించిన విషయం తెలిసిందే.