కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వై.ఎస్‌.జగన్‌

0
12
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నెల 21న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తెలంగాణ సర్కార్‌ ముఖ్యఅతిథిగా ఆహ్వానించనుంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజయవాడ వెళ్లి స్వయంగా వైఎస్‌ జగన్‌ను ఆహ్వా నించనున్నారు. కాగా ఇటీవలే సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పరిధిలోని పలు పంపుహౌస్‌లు, బ్యారేజీ పనులను స్వయంగా పర్యవేక్షించారు.

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలంటే దశాబ్దాలు పట్టే దేశంలో రెండు మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పలు బ్యారేజీలు, అత్యంత క్లిష్టమైన ఎత్తిపోతల నిర్మాణాలు, విద్యుత్‌ సబ్‌ స్టేషన్లను పూర్తి చేస్తుండడంతో ప్రపంచం తెలంగాణ వైపు చూస్తోందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.