ఏపిఐఐసి ఛైర్ పర్సన్ గా ఆర్.కె.రోజా

0
98
advertisment

మనఛానల్ న్యూస్ – అమరావతి

నగిరి ఎం.ఎల్.ఏ సినీ నటి ఆర్.కె.రోజా ను ఏపిఐఐసి ఛైర్ పర్సన్ గా బుధవారం రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. తొలి మంత్రి వర్గంలో చోటు దక్కలేదని కొంత ముభావంగా ఉన్న ఆర్.కె.రోజాను మంగళవారం విజయసాయిరెడ్డి ద్వారా ఫోన్ చేసి పిలిపించుకొని వై.ఎస్. జగన్ మాట్లాడి ఆమె ను ఈ పదవికి ఒప్పించారు. వచ్చే మంత్రి వర్గంలో తప్పక రోజాకు జగన్ అవకాశం ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసింది. పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధికి ఉద్దేశించిన ఈసంస్థలో రోజా కు కీలక పదవి వరించింది. ఈ పదవికి కెబినెట్ స్థాయి ర్యాంకు ఉంది.