ఈరోజు వార్తలు (బుధవారం)క్లిక్ చేసి తప్పక చదవండి. Click for Today News

0
201
advertisment

Manachannelnews – News Desk June12, 2019 2.50 p.m

చంద్రయాన్ -2 ప్రయోగం జులై15 మద్యాహ్నం 2.51 నిమిషాలకు ప్రయోగించనున్నట్లు ఇస్రో ఛైర్మన్ శివన్ బుధవారం అధికారికంగా ప్రకటించారు. ప్రయోగ ప్రక్రియ జులై9 నుంచి 15వ తేది మధ్య పూర్తి అవుతుందని తెలిపారు. భారతదేశ శాస్త్ర సాంకేతిక రంగంలో చంద్రయాన్-2 ప్రయోగం అత్యంత ముఖ్యమైన ఘట్టంగా ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.630 కోట్లు వినియోగించినట్లు తెలిపారు. ఈ ప్రయోగం లో సుమారు 500 విశ్వ విద్యాలయాలు తమ పాత్ర పోషించాయని తెలిపారు. 3.8 టన్నుల బరువైన వాహకనౌక ద్వారా ఈ ప్రయోగం జరగుతోంది.

ఉత్తర ప్రదేశ్ లో మెదడు వాపు వ్యాధితో కేవలం 48 గంటలలో 36 మంది పిల్లలు మృత్యువాత పడ్డారు. ముజపర్ బాద్ జిల్లాలో పరిస్థితి ఘోరంగా తయారైంది. వ్యాధుల పట్ల తల్లి దండ్రులకు సరైన అవగాహన లేకపోవడం, ఆసుపత్రులలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా పిల్లల మరణాల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రులలో అనారోగ్యంతో చేరే పిల్లల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా జ్వరం రావడం, మానసిక ఆందోళన, తరచుగా ఉద్వేగానికి లోనవడం, కోమాలోకి వెల్లుతండడంతో మరణాల సంఖ్య పెరుగుతోంది. శిశు మరణాల రేటు పెరుగుతుండడంతో యుపి ప్రభుత్వం టెన్షన్ పడుతోంది. ఈ వ్యాధుల నివారణ, మరణాల తగ్గింపుకు వైధ్యులు ప్రయత్నాలు ప్రారంభించారు.

నగిరి ఎం.ఎల్.ఏ సినీ నటి ఆర్.కె.రోజా ను ఏపిఐఐసి ఛైర్ పర్సన్ గా బుధవారం రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధికి ఉద్దేశించిన ఈసంస్థలో రోజా కు కీలక పదవి వరించింది. ఈ పదవికి కెబినెట్ స్థాయి ర్యాంకు ఉంది.

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నెల 21న ఘనంగా ప్రారంభించాలని సి.ఎం. కె.సి.ఆర్ నిర్ణయించారు. ఈ ప్రారంభత్సోవానికి ఏపి నూతన ముఖ్యమంత్రి యంగ్ డైనమిక్ సి.ఎం. వై.ఎస్.జగన్ మెహన్ రెడ్డిని స్వయంగా ఆహ్వానించాలని కె.సి.ఆర్ నిర్ణయించారు. ఈమేరకు ఆయన రెండు మూడు రోజులలో అమరావతికి రావాలని నిర్ణయించారని సమాచారం. అలాగే ఒడిస్సా సి.ఎం.నవీన్ పట్నాయక్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులను ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లు తెలిసింది.

advertisment

ఎపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై సభ్యుల ప్రమాణ స్వీకారంతో ముగిసింది. కొత్తగా ఎన్నికైన 175 మంది సభ్యులను అక్షర క్రమంలో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ ఎం.ఎల్.ఏ గా ప్రమాణ స్వీకారం చేయగ, తర్వాత ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. సభ్యులలో మెుదట కడప ఎం.ఎల్.ఏ డిప్యూటి సి.ఎం. అంజాద్ బాష తో సభ్యుల ప్రమాణ స్వీకారం ప్రారంభమైంది.

యంగ్ డైనమిక్ సి.ఎం. వై.ఎస్ జగన్ కెబినెట్ లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన పలువురు బుధవారం మంచి రోజు కావడంతో తమ చాంబర్లలో బాధ్యతలు స్వీకరించారు.సాంఘికసంక్షేమ శాఖ మంత్రి పినెపే విశ్వ స్వరూప్, గృహనిర్మాణ శాఖ మంత్రి సి.శ్రీరంగనాథరాజు, రెవిన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ లు బాధ్యతలు స్వీకరించారు.

అనంతపురం జిల్లా నార్పల మండలం ముచ్చుకోట కనుమ వద్ద బుధవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఓ ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొని,అనంతరం బోల్తా పడడంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. లారీ డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణలో గద్యాల్ మాజీ ఎం.ఎల్.ఏ గట్టు భీముడు బుధవారం అనారోగ్యంతో మరణించారు. తీవ్రమైన బి.పితో బాధపడుతున్న ఈయనను కుటుంబ సభ్యులు నిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్యం అందిస్తుండగా, చికిత్స పొందుతూ ఆయన మరణించారు.

ఏపిలో కొత్త ప్రభుత్వం చీఫ్ విప్ గా గడికోట శ్రీకాంత్ రెడ్డిని నియమించింది. అలాగే ముత్యాలనాయుడు(మాడుగుల), దాడిశెట్టి రాజా(తుని), చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి(చంద్రగిరి), శ్రీనివాసులు (రైల్వే కోడూరు)విప్‌లుగా నియమితులైన విషయం తెలిసిందే. కొలుసు పార్థసారధిని విప్‌ బాధ్యతల నుంచి తొలగించారు. తాజా ప్రభుత్వం మరో ముగ్గురిని ప్రభుత్వ విప్‌లుగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. సామినేని ఉదయభాను(జగ్గయ్యపేట), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (మాచర్ల), కాపు రామచంద్రారెడ్డి (రాయదుర్గం) లకు ప్రభుత్వ విప్‌లుగా అవకాశం కల్పించారు.

హైదరబాద్ నగర శివారులలో అబ్దుల్లాపూర్‌మెట్‌ సమీపంలో 65వ జాతీయ రహదారిపై బుధవారం ఉదయం 6గంటల సమయంలో విజయవాడ వైపు నుంచి హైదరాబాద్‌ వస్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన డ్రైవర్‌ లారీని రోడ్డు పక్కన నిలిపివేశాడు. డ్రైవర్‌ కిందకు దిగిన వెంటనే క్షణాల్లో లారీ మొత్తం మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది.