సరికొత్త డ్రోన్‌ను రూపొందించిన మిట్స్‌ కళాశాల విద్యార్థులు

0
63
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లె
చిత్తూరుజిల్లా కురబలకోట మండలం అంగళ్లు సమీపంలో గల మదనపల్లి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ & సైన్స్‌ (మిట్స్‌ కళాశాల) నందు బీ.టెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగంలో చివరి సంవత్సరం చదువుతున్న టి.సి గణేష్,బి.గౌతమ్ సాయి, డి.చక్రవర్తి మరియు యం.ప్రవల్లికలు కలసి “డిజైనింగ్, మోడలింగ్ అండ్ కంట్రోలింగ్ ఆఫ్ మెడికల్ డ్రోన్స్ ను రూపొందించారు.

ప్రతిభ కనపరిచారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు.ఈ విద్యార్థులు మాట్లాడుతూ డ్రోన్స్ అనగా వైమానిక వాహన బోర్డు అని, ఇది పైలట్ చే ఆపరేటింగ్ చేయడం కాకుండా రిమోట్ వ్యవస్థ ద్వారా నడిపే వాహనం అని విద్యార్థులు తెలిపారు. ముఖ్యంగా ఈ డ్రోన్ ద్వారా వస్తువులను ఒక ప్రదేశం నుండి ఇంకొక్క ప్రదేశంకు అతి తక్కువ సమయంలో సులభంగా చేరవయవచ్చునని తెలిపారు.

విపత్తుల సమయంలో ఈ డ్రోన్ ద్వారా ఆహార పదార్థాలను,మందులను,నిత్యవసర వస్తువులను ఒక ప్రదేశం నుండి మరి యొక్క ప్రదేశానికి పంపించడానికి ఈ డ్రోన్ ను ఉపయోగిస్తారని విద్యార్థులు తెలిపారు. అంతే కాకుండా ఈ పద్దతి ద్వారా మెడికల్ విభాగం నందు ఉన్న అత్యవసర మెడిసిన్స్ మందులు, వైద్య పరికరాలు, రక్తం మరియు రక్త ఉత్పన్నాలను

గ్రామీణ ఆరోగ్య కేంద్రాలకు చేరవేయుటకు ముఖ్యముగా విద్యార్థులు దీనిని తయారు చేసినట్లు, ఇందులో GPS(Global Positioning System) సిస్టమ్ ద్వారా లొకేషన్ ను ఫిక్స్ చేయాలనీ ,తద్వారా ఆ లొకేషన్ కు ఇది వెళుతుందన్నారు.ముఖ్యంగా ఈ విద్యార్థులు ఈ నూతన ఆవిస్కరణల వైద్య ఉత్పన్నాలు మరియు మెడిసిన్స్ ను వారికీ కావలసిన స్థానానికి పంపిణీ చేయడానికి, ఇహి తయారు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ విద్యార్థులకు కళాశాల యాజమాన్యం, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్, విధగాధిపతి డాక్టర్ ఆశా రాణి మరియు డాక్టర్ ఏం.విజయ్ తదితరులు అభినందనలు తెలిపారు.