కొత్త జెడ్పీ చైర్మన్లకు దిశానిర్ధేశం చేసిన సీఎం కేసీఆర్‌

0
37
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
తెలంగాణ పరిషత్‌ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది.దీంతో నూతనంగా ఎన్నికైన జిల్లా పరిషత్‌ ఛైర్మన్లు, ఛైర్‌పర్సన్లతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో సమా వేశమయ్యారు. రానున్న రోజుల్లో గ్రామీణ, పట్టణాభివృద్ధికి ఎలా పాటుపడాలనే అంశంపై సీఎం దిశా నిర్దేశం చేశారు.

ఈ భేటీలో జడ్పీ ఛైర్‌పర్సన్లు, ఛైర్మన్లతో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు.ఇటీవల జరి గిన పరిషత్‌ పోరులో తెరాస ప్రభంజనం సృష్టించింది. ఎంపీటీసీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన గులాబీ శ్రేణులు మెజార్టీ ఎంపీటీసీ స్థానాల్లో గెలిచి మండలాధ్యక్ష పదవుల్ని కైవసం చేసుకున్నాయి.

జడ్పీటీసీ ఎన్నికల్లోనూ విజయ దుదుంభి మోగించిన తెరాస 32 జిల్లా అధ్యక్ష పదువులు దక్కించుకొని క్లీన్‌స్వీప్‌ చేసింది.అన్ని జిల్లా పరిషత్‌లపైనా గులాబీ జెండా రెపరెపలాడిన విషయం తెలిసిందే.