ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్‌ను కలసిన కర్ణాటక సీఎం తనయుడు

0
65
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ గౌడ మర్యాదపూపూర్వకంగా కలిశారు. మంగళవారం ఆయన ముఖ్యమంత్రి నివాసానికి రాగా సీఎం జగన్‌ నిఖిల్‌ను సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఇద్దరు కాసేపు ముచ్చటించారు. కాగా సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగానే కలిశానని నిఖిల్‌ పేర్కొన్నారు.

లోక్‌ సభ ఎన్నికల్లో కర్ణాకటలోని మండ్య లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన నిఖిల్‌ ఘోరంగా ఓటమి పాలయ్యారు. మండ్యలో బీజేపీ మద్దతుతో పోటీ చేసిన సుమలత అంబరీష్‌ నిఖిల్‌పై గెలుపొందారు. నిఖిల్‌ గౌడతో సమావేశ అనంతరం సీఎం జగన్‌ తెలుగు కవి, సాహితీవేత్త సినారె (సింగిరెడ్డి నారాయణ రెడ్డి) పార్లమెంట్‌ ప్రసంగాలపై రూపొందించిన పుస్తకాన్నిఆవిష్కరించారు.

తాడేపల్లి సీఎం క్యాంప్‌ ఆఫీస్‌లో జరిగిని ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, నేషనల్‌ జ్యూడిషియల్‌ అకాడమీ డైరెక్టర్‌ జస్టిస్‌ గోడ రఘురామ్, తదితరులు పాల్గొన్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ రచించిన ‘పెద్దల సభలో తెలుగు పెద్ద’ పుస్తకాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.