ఏపీలో రేపటి నుండి రాజన్న బడిబాట – మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడి

0
35
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – అమరావతి
ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా రేపటి రాజన్న బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆది మూలపు సురేష్‌ మంగళవారం వెల్లడించారు.100 శాతం పిల్లలు స్కూళ్లలో చేరేలా చేస్తామన్నారు.

మంత్రి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు నియంత్రించేందుకు కమిటీ వేస్తున్నాము. విద్యను వ్యాపారం చేస్తే సహించం. విద్యా సంస్కరణల కోసం నూతన విద్యా విధానాన్ని నిపుణులతో రూపొంది స్తాము.

2019 నుండి 2024 వరకు చేయబోయే మార్పులతో నూతన పాలసీ ఉంటుంది. అమ్మ ఒడి పథకాన్ని జనవరి 26 నుండి అమలు చేస్తాం.వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి తొలి క్యాబినెట్ నిర్ణయాలతోనే విద్యావిధా నంలో సంస్కరణలు మొదలయ్యాయని ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.