ఈ రోజు వార్తలు …Brief News

0
44
advertisment

manachannelnews – News Desk

  1. 2017లో జెట్ ఎయిర్ వేస్ విమానాన్ని హైజాక్ చేసిన కేసులో అహ్మాదాబాద్ లోని
    జులై1,2019 నుంచి ఏపిలో నూతన ఇసుక విధానం తీసుకొస్తున్నట్లు రాష్ట్ర గనులు పంచాయతీ రాజ్ అండ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు.అలాగే రాష్ట్రంలో తక్షణమే ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని గనుల శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు.ఇకపై ఎవరైనా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే పీడీ యాక్టు కింద కేసులు పెడతామని హెచ్చరించారు.

2. జగన్ మోహన్ రెడ్డి తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేసి డైనమిక్ సి.ఎం గా పేరు గడిస్తున్నారని సి.పి.ఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశసించారు. ప్రజలికిచ్చిన హామీలు అమలుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో నామనేటెడ్ పదవులలో నియమితులై కొనసాగుతున్న నేతలు ఒక్కొక్కరు పదవులకు రాజీనామా చేస్తున్నారు.మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవికి జూపూడి ప్రభాకర్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు పంపించారు. జగన్ ప్రభుత్వం నామనేటెడ్ పదవులలో కొనసాగుతున్న వారిని తొలగింపుకు త్వరలో ఆర్ఢినెన్స్ తీసుకువస్తున్న తరుణంలో పలువురు స్వచ్ఛందంగా తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు.

3. దేశవ్యాప్తంగా నడుస్తోన్న ఇస్లామిక్ మదరసాలను మరింత ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి ముక్తహర్ అబ్బాస్ నిఖ్వీ తెలిపారు. మదరసాలలో పని చేసే ఉపాధ్యాయులకు హింది,ఇంగ్లీషు, సైన్స్, కంప్యూటర్స్ పై శిక్షణ ఇస్తామని తెలిపారు.ఖురాన్ ను కంప్యూటర్ లో నిక్షిప్తం చేసి చేతిలో పట్టుకొని వెళ్లవచ్చునని అన్నారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాబోయే బడ్జెట్ సమావేశాలలో కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందస్తు చర్చలను మంగళవారం ప్రారంభించారు.ఇందులో వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధిశాఖ అధికారులతో బడ్జెట్ పై చర్చించారు.

4 నూతన యాజమాన్యాన్ని మోసం చేయడం, పోర్జరీ వంటి కేసులలో పీకల లోతు ఇరుక్కొన్న టివి9 రవిప్రకాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ కేసు విచారణ ఈ నెల 18వతేదికి వాయిదా వేశారు. టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ సాక్షులను, దర్యాప్తును ప్రభావితం చేస్తున్నందున ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని హైకోర్టును తెలంగాణా పోలీసులు కోరారు.