అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు – చిత్తూరు కలెక్టర్‌ భరత్‌ గుప్తా

0
45
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లె
ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ శ్రీ.నారాయణ భరత్ గుప్త విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.

సోమవారం సాయంత్రం సబ్ కలెక్టర్ చాంబర్ నందు సబ్ కలెక్టర్ కీర్తి చేకూరి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీ తేజ్ తో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 5వ తేదీన జిల్లా కలెక్టరుగా భాద్యతలు స్వీకరించడం జరిగిందని జిల్లాలో మదనపల్లి సబ్ కలెక్టర్ గాను జాయింట్ కలెక్టర్ గాను 3 సంవత్సరాలు సేవ చేయడం జరిగిందని, మళ్ళీ జిల్లా కలెక్టర్ గా ప్రజలకు సేవ చేసే అవకాశం కలిగినందుకు ఆనందంగా ఉందని తెలిపారు.

అవినీతి రహిత, పారదర్శకత పాలన అందించాలన్నదే ముఖ్యమంత్రి గారి ముఖ్య ఉద్దేశమని, దానికి అనుగుణంగా పని చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ రోజు మదనపల్లి డివిజన్ కేంద్రం నందు మీ కోసం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో పెన్షన్లు,ఇంటి పట్టాలు,భూ సర్వే,భూ సమస్యలు,గృహాల మంజూరు,విద్యుత్, త్రాగునీటి సమస్యలు, హంద్రీ-నీవా సుజల స్రవంతికి (హెచ్.ఎన్. ఎస్), నేషనల్ హైవే (ఎన్.హెచ్)కి, భూములు కోల్పోయిన వారికి నష్ట పరిహారం,

పట్టాదారు పాసులు పుస్తకాలు, ఈ పాస్ పుస్తకాలు, భూములు ఆన్ లైన్ చేయించాలని, గృహాలకు స్థలం మంజూరు చేయాలని, దారి సమస్య, సబ్ కలెక్టర్ కార్యాలయం కోర్టులో పెండింగులో ఉన్న కేసు లు వంటి సమస్యల అర్జీలు వచ్చాయని తెలిపారు. ఇకా మీదట ప్రతి నెలలో 2 నియోజకవర్గ కేంద్రాలలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా మీ కోసం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

మదనపల్లి పట్టణంలో త్రాగునీటి సమస్య చాల తీవ్రంగా ఉందని, గత సంవత్సరం కంటే 50 శాతం నీటి సమస్య అధికమయిందని, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు.2 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు అందుబాటులోకి తీసుకొచ్చి వాటికి ఏ విధంగా నీటిని నింపేందుకు చర్యలు తీసుకోవ డం జరుగుతుందని తెలిపారు.

advertisment

మదనపల్లి పట్టణంలో ఎంత మందికి ఎన్ని గృహాలు అవసరం అవుతుందో దానికి అనుగుణంగా భూ సేకరణ చేయడం జరుగుతుందని, గృహాలు ఎవరికీ ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయం ప్రకారం చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయుటకు రెండుమూడు రోజుల్లో ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు.కోమటివాని చెరువు ఆక్రమణలపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.