రూ.40 కోట్ల విలువైన వెండి స్వాధీనం

0
225

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
తెలంగాణ సిక్రింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లిలో పది టన్నుల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న కంటైనర్‌ సోమవారం పోలీసులకు పట్టుబడింది.

వాహనంలోని వెండి విలువ సుమారు రూ.40 కోట్ల వరకు ఉండొచ్చని పోలీసులు అంచనావేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వెండి తరలింపుపై పోలీసులకు అనుమానం రావడంతో వాహనా లు తనిఖీ నిర్వహించారు.

ఈ నేపథ్యంలో కంటైనర్‌ను తనిఖీ చేయగా దానిలో 9వేలకు పైగా వెండి కడ్డీలను పోలీసులు గుర్తించా రు. వెండికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్లు, ఆధారాలు లేకపోవడంతో వాహనం డ్రైవర్లను పోలీసు లు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారి వద్ద నుంచి మరింత సమాచారాన్నిరాబట్టేందుకు ప్రశ్నిస్తున్నారు.