మల్లు భట్టివిక్రమార్క దీక్ష భగ్నం – నిమ్స్‌కు తరలింపు

0
35
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
తెలంగాణ కాంగ్రెస్‌ నేత మల్లు భట్టివిక్రమార్క హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ వద్ద చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు.సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ ఆయన గత రెండు రోజుగా దీక్ష చేస్తున్న సంగతి విదితమే.

సోమవారం ఉదయం దీక్ష కొనసాగిస్తున్న భట్టి విక్రమార్కను అరెస్టు చేసిన పోలీసులు ఆయన్ని అక్కడి నుంచి నిమ్స్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులను అడ్డుకునేందుకు కార్యకర్తలు ప్రయత్నించగా కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ ఈ నెల 8 నుంచి భట్టి ఆమ రణ దీక్షకు దిగిన విషయం తెలిసిందే.

నిన్న దీక్షా శిబిరానికి పలువురు కాంగ్రెస్‌ నేతలు, ఇతర ముఖ్యులు వచ్చి భట్టి విక్రమార్కకు సంఘీ భావం ప్రకటించారు. ఈ సందర్భంగా భట్టివిక్రమార్క మాట్లాడుతూ కేసీఆర్‌ మనస్తత్వం ఉన్న సీఎంలు నలుగురుంటే దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోతుందన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.