ఐటీ గ్రిడ్స్‌ డైరెక్టర్‌ అశోక్‌కు ముందస్తు బెయిల్‌ మంజూరు

0
80

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌

ఐటీగ్రిడ్స్‌ సంస్థ నిర్వాహకుడు అశోక్‌కు సోమవారం ముందస్తు బెయిల్‌ మంజూరైంది. ఆధార్, ఇతర డేటా చోరీ చేశాడని అశోక్‌పై ఆధార్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ ఫిర్యాదు చేయడంతో మాదాపూర్ పోలీసులు సెక్షన్ 37, 38-ఏ, 38-బీ, 38-జీ, 40, 42, 44-ఏఏల కింద ఐటీగ్రిడ్స్ సంస్థపై కేసులు నమోదుచేశారు.

అప్పటి నుంచి పరారీలో ఉన్న అశోక్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ఐప్లె చేశాడు. అశోక్‌కు షరతు లతో కూడిన బెయిల్‌లో హైకోర్టు మంజూరు చేసింది. పాస్‌పోర్టు అప్పగించాలని కోర్టు అశోక్‌కు ఆదేశిం చింది. ప్రతి రోజూ పోలీస్‌స్టేషన్‌కు హాజరుకావాలని షరతు విధించింది.