అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన యువరాజ్‌ సింగ్‌

0
13
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
సిక్సర్ల వీరుడు, భారత క్రికెట్‌ జట్టు ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలి కాడు. నిలకడలేమి ఆటతో జట్టుకు దూరమైన యువీ అనూహ్యంగా సోమవారం వీడ్కోలు పలికాడు. ముంబైలోని ఓ హోటల్‌లో మీడియాతో సమావేశమైన యువీ తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని లాంఛనంగా ప్రకటించాడు.

దాదాపు 17 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని, జీవితంలో ఏ విధంగా పోరాడాలో ఆటనే నేర్పిందని యువరాజ్‌ భావోద్వేగానికి గురయ్యాడు.మహేంద్రసింగ్‌ ధోని సారథ్యంలో భారత్‌ సాధించిన రెండు ప్రపంచకప్‌ల్లో యువీ కీలక పాత్రపోషించాడు.ముఖ్యంగా 2011 ప్రపంచకప్‌లో బ్యాట్‌తో బంతితో మెరిసి మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అందుకున్నాడు.ప్రాణాంతక మహమ్మారి క్యాన్సర్‌ ఉందని తెలిసినా ఆటకే ప్రాధాన్యత ఇచ్చిన యువీ ప్రపంచకప్‌ అనంతరం అమెరికా వెళ్లి చికిత్స చేసుకున్నాడు.

ఈ చికిత్స అనంతరం యువీ కెరీర్‌లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోవడం.. యువ ఆటగాళ్ల నుంచి పోటీ ఎదురు కావడంతో జట్టులో స్థానం కోల్పోయాడు.ఇక భారత జట్టు తరపున 2012లో చివరి టెస్ట్ 2017లో చివరి వన్డే, టీ20 ఆడిన యువీ ఐపీఎల్-12లో ముంబై ఇండియన్స్ తరపున ఆడినా పెద్దగా ఆకట్టుకోలేదు.1996లో అండర్-15 వరల్డ్ కప్, 2000 సంవత్సరంలో అండర్-19 వరల్డ్ కప్, 2007,2011 ప్రపంచకప్‌ల్లో యువరాజ్‌ సింగ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాడు.

2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో 6 బంతులకు 6 సిక్స్‌లు కొట్టి నయా ట్రెండ్‌ సృష్టించాడు. మొత్తం 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన యువీ 1900 పరుగులు చేశాడు.టెస్ట్‌ల్లో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

వన్డే కెరీర్‌లో 304 మ్యాచ్‌ల్లో 8701 పరుగులు చేశాడు. వన్డేల్లో 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు.58 టీ20 మ్యాచ్‌లు ఆడిన యువీ 1177 పరుగులు నమోదు చేశాడు. టీ20ల్లో 8 ఆఫ్ సెంచరీలు నమోదు చేశాడు. 132 ఐపీఎల్ మ్యాచుల్లో 2750 పరుగులు చేశాడు.