పెద్దిరెడ్డికి మంత్రి పదవి పై జిల్లాలో వై.ఎస్.ఆర్.సి.పి శ్రేణులు సంబరాలు

0
208
advertisment

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
యువ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మెహన్ రెడ్డి కెబినెట్ లో చిత్తూరు జిల్లాకు చెందిన వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవి వరించడంపై జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తం అయింది. వైకాపా శ్రేణులు సంభరాలు జరుపుకొన్నారు. పలు చోట్ల బాణా సంచి కాల్చుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకొన్నారు. మదనపల్లి పట్టణంలో 18 వ వార్డులో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ యూత్ సెక్రటరి ఎస్.ఏ.కరీముల్లా పార్టీ కార్యకర్తలకు, స్థానికులకు మిఠాయి
లు పంచి పెట్టారు. కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎస్.ఏ కరీముల్లా మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి మంత్రి పదవి దక్కడం వల్ల జిల్లా అభివృద్ధికి ఆస్కారం ఏర్పడిందని ఆయన తెలిపారు. పార్టీ అభ్యున్నతికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఈకార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, ఎం.పి.టి.సి. శ్రీకాంత్ రెడ్డి, రమాదేవి, షమ, కమల, షబ్బీర్, యర్రారెడ్డి, షమీవుల్లా, రఫీ తదితరులు పాల్గోన్నారు.