రేణిగుంట వద్ద ఘోరరోడ్డుప్రమాదం – ఐదుగురు దుర్మరణం

0
136
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – తిరుపతి
చిత్తూరుజిల్లా రేణిగుంట వద్ద ఘోరరోడ్డు ప్రమాదం సంభవించింది.ఆగివున్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు అక్కడకక్కడే మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలోని పూతలపట్టు జాతీయ రహదారిపై దురవరాజుపల్లి వద్ద శుక్రవారం ఉదయం 5గంటల సమయంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కారులో ప్రయాణిస్తున్న గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం రుద్రవరానికి చెందిన విజయ భారతి(38), ప్రసన్న(14), చెన్నకేశవరెడ్డి(12), డ్రైవర్‌ ప్రేమ్‌రాజు (35), అంకయ్య(40) అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

బాధితులు అచ్చంపేట నుంచి తిరుపతికి వస్తుండగా దురవరాజుపల్లి వద్దకు రాగానే ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. రేణిగుంట పట్టణ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తర లించారు.