బంజారాహిల్స్‌ పోలీసుల ఎదుట హాజరైన రవిప్రకాశ్‌

0
204

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
శుక్రవారం ఉదయం బంజారాహిల్స్‌ పోలీసుల ఎదుట టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ హాజరయ్యారు. టీవీ 9 ట్రేడ్‌మార్క్‌, కాపీరైట్లను అక్రమంగా విక్రయించారనే ఫిర్యాదు మేరకు రవిప్రకాశ్‌తో పాటు మరో ఇద్దరిపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

అలంద మీడియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవిప్రకాశ్‌పై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. విచారణకు హాజరు కావాలని బంజారాహిల్స్‌ పోలీసులు నోటీసులు జారీ చేయడం తో ఆయన పోలీస్‌స్టేషన్‌లో హాజరయ్యారు. ఏసీపీ కేఎస్‌ రావు రవిప్రకాశ్‌ను ప్రశ్నిస్తున్నారు.

మీడియా నెక్ట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు టీవీ 9 ట్రేడ్‌ మార్క్‌, కాపీ రైట్లు ఎందుకు విక్రయించారనే దానికి సంబంధించి రవిప్రకాశ్‌ను ప్రశ్నిస్తున్నారు.టీవీ 9 వాటాల వివాదం కేసుకు సంబంధించి సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గత మూడు రోజులుగా రవిప్రకాశ్‌ను విచారిస్తున్న విషయం తెలిసిందే. రవిప్రకాశ్‌ దర్యాప్తునకు సరైన రీతిలో సహకరించడంలేదని పోలీసులు చెబుతున్నారు.