నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్‌…

0
486

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నలకు తీపికబురు లభించింది.ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు రాగల 24 గంటల్లో కేరళను తాకనున్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అధికా రులు శుక్రవారం వెల్లడించారు. రుతుపవనాల రాకకు అనువైన వాతావరణం ఏర్పడిందని, దీంతో వచ్చే 24 గంటల్లో కేరళను తాకే అవకాశాలున్నాయని ఐఎండీ ఓ ప్రకటనలో తెలిపింది.

జూన్‌ 9న కొల్లాం, అలప్పుళా జిల్లాలు, జూన్‌ 10న తిరువనంతపురం, ఎర్నాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆ ప్రాంతాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. నైరుతి అరే బియా సముద్రం అల్లకల్లోలంగా మారనుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.

మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ వారంతం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచ నా వేస్తున్నారు. దిల్లీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, విదర్భ, ఉత్తరప్రదేశ్‌ల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమో దయ్యే అవకాశాలున్నాయని తెలిపారు.