దుబాయిలో రోడ్డుప్రమాదం – 8 మంది భారతీయులు మృతి

0
153
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – ఎన్ఆర్ఐ డెస్క్‌
గల్ఫ్‌ దేశమైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని దుబాయిలో గురువారం రాత్రి ఘోరరోడ్డు ప్రమాదం సంభ వించింది.ఈ దుర్ఘటనలో మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు.మృతిచెందిన వారిలో 8 మంది భారతీయులు ఉన్నారని దుబాయిలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.

31 మంది ప్రయాణికులతో ఒమన్‌ నుంచి దుబాయికి తిరిగి వస్తున్న బస్సు మార్గమధ్యంలో ఓ మెట్రో స్టేషన్‌ వద్ద అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. అతివేగంతో ట్రాఫిక్‌ సిగ్నల్‌ను దాటుకుంటూ వెళ్లి సైన్‌ బోర్డును ఢీకొట్టింది.ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగురు గాయపడినట్లు దుబా యి పోలీసులు వెల్లడించారు.కాగా మృతుల్లో 8 మంది భారతీయులు ఉన్నట్లు దుబాయిలోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది.

భారత్‌కు చెందిన రాజగోపాలన్‌, ఫిరోజ్‌ ఖాన్‌ పఠాన్‌, రేష్మ ఫిరోజ్‌ ఖాన్‌ పఠాన్‌, దీపక్‌ కుమార్‌, జమా లుద్దీన్‌ అరక్కవీటిల్‌, కిరన్‌ జానీ, వాసుదేవ్‌, తిలక్‌రామ్‌ జవహార్‌ ఠాకూర్‌ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు కాన్సులేట్‌ అధికారులు తెలిపారు.మృతుల కుటుంబాలకు ఇప్పటికే సమాచారం అందిం చామని, బాధితులకు రాయబార కార్యాలయం అండగా ఉంటుందన్నారు.