టిటిడి బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేసిన సుధామూర్తి

0
24
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – తిరుమల
తితిదేలో పాలకమండలి సభ్యు రాజీనామాల పరంపర కొనసాగుతోంది.తాజాగా బోర్డులో సభ్యులుగా ఉన్న ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ సుధామూర్తి ఆ పదవికి గురువారం రాజీనామా చేశారు. గతేడాది మే నెలలో రెండోసారి ఆమె బోర్డు సభ్యులుగా నియమితులయ్యారు.

తొలిసారి పాలకమండలి పదవీ కాలం ముగియడంతో రెండోసారి ఆమెకు అవకాశం దక్కింది. అయితే, రాజీనామాకు గల కారణాలను మాత్రం ఆమె లేఖలో ప్రస్తావించలేదు.ఇప్పటికే తితిదే పాలక మండలికి పొట్లూరి రమేశ్‌ బాబు, చల్లా రామచంద్రారెడ్డి రాజీనామా చేయగా

ఎస్వీబీసీ ఛానెల్‌కు ఛైర్మన్‌గా వ్యవహరించిన ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు సైతం బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు తితిదే పాలక మండలిని త్వరలో రద్దు చేసి కొత్త మండలిని ఏర్పాటు చేసే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది.