చేపమందు ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం

0
22
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే చేపమందు ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లుచేసింది. మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా వ్యాధిగ్రస్థులకు బత్తిని మృగశిర ట్రస్ట్ ఆధ్వర్యంలో చేప ప్రసాదం పంపిణీ శనివారం (ఈ నెల 8న) సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్నది.

మత్స్యశాఖ కొరమీను చేపపిల్లలను అందుబాటులో ఉంచుతుండగా, బత్తిన సోదరులు చేప ప్రసాదాన్ని ఉచితంగా అందించనున్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో 1.6 లక్షల కొర్రమీన్లను అందుబాటులో ఉంచా రు. చేప ప్రసాద పంపిణీకి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో 36 కౌంటర్లను ఏర్పాటుచేస్తున్నారు. మహిళలకు, విక లాంగులకు, వృద్ధులకు, ప్రముఖులకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుచేశారు.

తెలుగు రాష్ర్టాలతోపాటు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఒడిశా తదితర రాష్ర్టాల నుంచి జనం చేప మందు తీసుకొనేందుకు ఇప్పటికే హైదరాబాద్‌కు వచ్చి ఎగ్జిబిషన్ మైదానం సహా పలు ప్రాంతాల్లో సేదతీరుతున్నారు. సదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో తెలుగు, హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో సూచికబోర్డులను ఏర్పాటు చేశారు.

చేపమందు ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు

  • మైదానంలోకి వచ్చినవారి సందేహాలను నివృత్తిచేయడం, బస్సులు, రైళ్ల రాకపోకల సమాచారాన్ని అందజేసేందుకు మే ఐ హెల్ప్ బూత్‌లను నెలకొల్పారు.
  • చేప ప్రసాదం పంపిణీకి వచ్చేవారి కో సం గత ఏడాది వంద బస్సులు నడుపగా, ఈసారి హైదరాబాద్‌లోని 14 ట్రాఫిక్ హబ్‌ల నుంచి 150 ఆర్టీసీ బస్సులను ఏర్పాటుచేశారు. జీహెచ్‌ఎంసీ నుంచి 100 మొబైల్ టాయిలె ట్లు, పారిశుద్ధ్య నిర్వహణకు వెయ్యిమందికిపైగా సిబ్బందిని కేటాయించారు.
  • రోగులు, సహాయకుల కోసం రూ.5 భోజన కౌంటర్లు, బద్రివిశాల్ పన్నాలాల్ ట్రస్ట్, అగర్వాల్‌ట్రస్ట్, అగర్వాల్ సేవాదళ్, హైదరాబాద్ జైశ్వాల్‌సేవా సమితిలతో ఉచితంగా టిఫిన్లు, భోజనాలను సమకూర్చేందుకు ఏర్పాట్లు చేశారు.