విచారణకు మూడోరోజు హాజరైన రవిప్రకాశ్‌

0
35
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
నిధుల మళ్లింపు, ఫోర్జరీ మళ్లింపు కేసు విచారణలో భాగంగా టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్‌ వరుసగా మూడవరోజు విచారణకు హాజరయ్యాడు. గురువారం ఉదయం 10 గంటలు సమయంలో ఆయన సైబర్‌ క్రైం కార్యాలయానికి చేరుకున్నారు. 27 రోజుల పాటు పరారీలో ఉన్న ఆయన ఎట్టకేలకు మంగళవారం సాయంత్రం పోలీసుల ఎదుట హాజరైన సంగతి తెలిసిందే.

ఆయనను 5 గంటలపాటు పోలీసులు ప్రశ్నించారు. అయితే, రవిప్రకాశ్‌ పోలీసులకు ఏమాత్రం సహక రించకుండా వారి ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలిచ్చినట్టు సమాచారం. ఇక రెండోరోజు కూడా ఆయన తీరు మారలేదు. బుధవారం ఉదయం 11.30 గంటలు దాటిన తర్వాత సైబర్‌ క్రైం కార్యాలయా నికి వచ్చిన రవిప్రకాశ్‌ అక్కడ మీడియాతో మాట్లాడిన అనంతరం విచారణ కోసం లోపలకు వెళ్లారు.

అప్పటి నుంచి రాత్రి 10.30 గంటల వరకు 11 గంటలపాటు పోలీసులు ఆయన్ను విచారించారు. ప్రధా నంగా అలందా మీడియా కార్యదర్శి కౌశిక్‌రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన రెండు కేసు లపై పోలీసులు ప్రశ్నలు సంధించారు. టీవీ9 పాత యాజమాన్యం నుంచి అలందా మీడియాకు యాజ మాన్య బదిలీలు జరగకుండా ఉండేందుకు నకిలీ పత్రాలు సృష్టించడం

కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసి మినిస్ట్రీ ఆఫ్‌ కార్పొరేట్‌ అఫైర్స్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయడంపై నమో దైన రెండు కేసులకు సంబంధించి పోలీసులు విచారించారు. అయితే, విచారణలో తమకు రవిప్రకాశ్‌ ఎంతమాత్రం సహకరించలేదని పోలీసు అధికారులు తెలిపారు.