తొలిరోజే సరికొత్త వసూళ్లను రాబట్టిన సల్మాన్‌ఖాన్‌ ‘భారత్‌’

0
88
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – సినిమా డెస్క్‌
బాలీవుడ్‌లో మరోసారి తనసత్తాను చాటాడు స్టార్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌.తాజాగా విడుదలైన ‘భారత్‌’ సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద తనకు తిరుగులేదని నిరూపించాడు సల్మాన్‌.బుధవారం విడుదలైన ‘భారత్‌’ భారీ ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తోంది. సల్మాన్‌ఖాన్‌కు రంజాన్‌ సెంటిమెంట్‌ మరోసారి వర్క్‌వుటయింది.

భారత్‌, దక్షిణాఫ్రికా వన్డే వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ ఉన్నప్పటికీ సల్మాన్‌ చిత్రానికి వసూళ్ల వర్షం కురవడం విశే షం.సల్మాన్‌ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్‌ రాబట్టిన సినిమాగా ‘భారత్‌’ రికార్డు సాధించింది. అంతే కాదు రంజాన్‌ రోజున విడుదలైన సల్మాన్‌ సినిమాల్లో టాప్‌ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. బుధ వారం విడుదలైన ఈ సినిమా తొలిరోజే రూ.42.30 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.

2016లో రంజాన్‌ రోజున విడుదలైన సుల్తాన్‌ సినిమా ఒక్కరోజు కలెక్షన్లను ఈ సినిమా అధిగమించింది. సుల్తాన్‌ సినిమా తొలిరోజు రూ. 36.54 కోట్లు వసూలు చేసింది.ఆ తర్వాత వచ్చిన టూబ్‌లైట్‌, రేస్‌ 3 సినిమాలు భారీ కలెక్షన్లు రాబట్టలేకపోయాయి.ఒక్క 2013లో మినహా 2010 నుంచి ఇప్పటివరకు ప్రతి రంజాన్‌కు సల్మాన్‌ఖాన్‌ విడుదలయ్యాయి.