ఘనంగా రామానాయడు జయంతి – ఫిల్మ్ చాంబర్ విగ్రహావిష్కరణ

0
25
advertisment

మనఛానల్ న్యూస్ – హైదరబాద్

తెెెలుగు సినీ నిర్మాత స్వర్గీయ డాక్టర్ డి.రామనాయుడు 83వ జయంతి వేడుకులు గురువారం హైదరబాద్ లోని ఫిల్మ్ నగర్ లో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన విగ్రహాన్ని స్థానిక ఫిలిం ఛాంబర్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రామానాయుడు కుమారుడు దగ్గుబాటి సురేష్ బాబు, మరియు మనవడు అభిరామ్ లు పాల్గోన్నారు. వీరితో పాటు సినిరంగానికి చెందిన ప్రముఖులు అల్లు అరవింద్, రాఘవేంద్రరావు, ఆదిశేషగిరి రావు, పర్చూరి బ్రదర్స్ తదితరులు పాల్గోన్నారు. మూవీ మెుఘల్ గా పేరుగాంచిన డి.రామానాయుడు సిని రంగానికి ఎంతో సేవ చేశారు. సినిమాలు నిర్మాణానికి ప్రత్యేకంగా స్టూడియో ను నిర్మించారు. అనారోగ్యంతో 2015 ఫిబ్రవరి 18న కన్నుమూసిన రామానాయుడు 1936లో జన్మించారు. 1963లో సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. 13 భారతీయ భాషల్లో 150కి పైగా సినిమాలను నిర్మించారు.