కీలక వడ్డీరేట్లను తగ్గించిన ఆర్‌బీఐ

0
23
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – ఎకానమీ డెస్క్‌
భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీరేట్లను గురువారం తగ్గించింది.ఈ ఆర్థిక సంవత్సరం రెండో ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గురు వారం వెల్లడించింది. ఇందులో రెపో రేటుపై పావు శాతం కోత విధించింది.

ప్రస్తుతం రెపో రేటు 6శాతంగా ఉండగా తాజా నిర్ణయంతో అది 5.75శాతానికి చేరింది. రివర్స్‌ రెపో రేటు, బ్యాంక్‌ రేటును వరుసగా 5.50శాతం, 6శాతానికి సవరించింది. ఆర్థిక వృద్ధి నెమ్మదించడం, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో వడ్డీరేట్లను తగ్గించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది.

పరపతి విధాన సమీక్షలో ఇందుకు ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఆర్‌బీఐ వరుసగా మూడు సమీక్ష ల్లోనూ వడ్డీరేట్లను తగ్గించడం విశేషం. ఈ నిర్ణయంతో గృహ, వాహన రుణాలపై వడ్డీభారం తగ్గనుంది.

2010 జులై తర్వాత రెపో రేటు 5.50శాతంగా ఉండగా ఆ తర్వాత ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం మళ్లీ ఇప్పుడే. కాగా వడ్డీరేట్ల తగ్గింపుతో స్టాక్‌ మార్కెట్లలో బ్యాంకింగ్‌ షేర్లు కుదేలయ్యాయి.హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్‌ మహింద్రా, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ తదితర షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.