ఆన్‌లైన్‌ ద్వారా నగదు బదిలీలకు ఛార్జీలను రద్దుచేసిన ఆర్‌బీఐ

0
92
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – బిజినెస్‌ డెస్క్‌
నెఫ్ట్‌,ఆర్టీజీఎస్‌ ద్వారా చేపట్టే ఆన్‌లైన్‌ నగదు లావాదేవీలపై ఛార్జీలను తొలగిస్తున్నట్లు రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వెల్లడించింది. దీంతో బ్యాంకు ఖాతాదారులకు పెద్ద ఊరట లభించినట్లయింది .ఇకపై ఈ లావాదేవీలు ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి. బ్యాంకులు ఈ సౌలభ్యాన్ని ఖాతాదా రులకు మళ్లించాలని ఆర్‌బీఐ కోరింది.

ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా గురువారం ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ ఆర్టీజీఎస్‌, నెఫ్ట్‌లపై విధిస్తున్న చార్జీలన్నింటినీ తొలగించాలని నిర్ణయించింది.డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది. భారీగా నిధుల బదిలీని చేపట్టే ఆర్టీజీఎస్‌, ఇతర నిధుల బదిలీల కోసం నెఫ్ట్‌ లావాదేవీలపై ఆర్‌బీఐ బ్యాంకుల నుంచి కనీస మొత్తాన్ని వసూలు చేస్తోంది.

బ్యాంకులు ఈ చార్జీలను కస్టమర్ల నుంచి వసూలు చేస్తున్నాయి. ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో ఆన్‌లైన్‌ నగదు ట్రాన్స్‌ఫర్‌ చేపట్టే కస్టమర్లకు ఊరట కలగనుంది.కాగా, మరో వారంలో దీనిపై బ్యాంకులకు నిర్ధిష్ట ఉత్తర్వులు జారీ చేస్తామని ఆర్‌బీఐ తెలిపింది.