మదనపల్లె జిల్లా డిమాండ్‌ను సీఎం వై.ఎస్‌.జగన్‌ దృష్టికి తీసుకెళ్తాం

0
273

– 6న మదనపల్లె జిల్లా సాధన సమితి ఏర్పాటు

– 8న ముఖ్యమంత్రి వద్దకు ప్రతినిధుల బృందం

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లె
మదనపల్లె జిల్లా ఏర్పాటు డిమాండును ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళనున్న ట్లు వీసీకే,సీపీఐ,సీపీఎం నేతలు పీటీయయం శివప్రసాద్,తోపు క్రిష్ణప్ప, పి.శ్రీనివాసులు, ప్రజాకవి పోత బోలు రెడ్డెప్ప తెలిపారు. మంగళవారం ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ కొత్త జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చొరవ చూపడం హర్షణీయమన్నారు.

ముఖ్యమంత్రి ప్రకటనతో మదనపల్లె ప్రజల చిరకాల స్వప్నమైన మదనపల్లె జిల్లా ఏర్పాటుకు మార్గం సుగమమయిందన్నారు. అయితే ప్రతి పార్లమెంటు వియోజకవర్గాన్ని ఒక జిల్లా చేయడంలో భాగంగా మదనపల్లెను కాకుoడా,రాజంపేటను జిల్లా చేస్తున్నట్లు వస్తున్న వార్తలు మదనపల్లె, పరిసర ప్రాంతాల ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నాయన్నారు.

ఇదే నిజమైతే మదనపల్లె ప్రాంత ప్రజల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డ చందంగా తయారవు తుందన్నారు. కావున మదనపల్లె ప్రజల చిరకాల స్వప్నమైన మదనపల్లె జిల్లా డిమాండును తక్షణమే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాల్సివుందన్నారు. ఇందులో భాగంగా మదనపల్లె చారిత్రక విశిష్టతలు, భౌగోలిక పరిస్థితులు, జిల్లా కేంద్రంగా సంతరించుకోడానికి గల సహేతుకమైన అర్హతలు ముఖ్యమంత్రికి వివరించడానికి ‘మదనపల్లె జిల్లా సాధన సమితి’ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ విషయమై చర్చించేందుకు 6వ తేదీ గురువారం ఉదయo 10 గంటలనుండి మదనపల్లెలో ‘మదన పల్లె జిల్లా సాధన చర్చావేదిక’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.రాజoపేట పార్లమెంటు సభ్యులు, మదనపల్లి, పుoగనూరు,పీలేరు,తoబళ్లపల్లి నియోజక వర్గాల శాసన సభ్యులు,మాజీ శాసన సభ్యులు,మాజీ పార్ల మెంటు సభ్యులతోపాటు అన్ని రాజకీయ పక్షాల నేతలు, మేధావులు, రచయితలు, కవులు, కళాకా రులు, ప్రజా సంఘాల.. కుల సంఘాల.. స్వచ్చంద సoస్థల ప్రతినిధులు,విద్యా సంస్థల నిర్వాహకులు, న్యాయవాదులు, వైద్యులు,జర్నలిస్టులు, విద్యార్థి, ఉద్యోగ,కార్మిక,రైతు,మహిళా,వ్యాపార,వాణిజ్య సం ఘాల ప్రతినిధులు,అన్ని మతాలకు చెoదిన పెద్దలు ఈ చర్చావేదికలో పాల్గొని, మదనపల్లె జిల్లా సాధ నలో భాగస్వాములు కావాలని వీరు అందరినీ సవినయoగా ఆహ్వానించారు.

చర్చావేదిక అనంతరం మదనపల్లె జిల్లా సాధన సమితికి కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందని, 8వ తేది మదనపల్లె జిల్లా సాధన సమితి ప్రతినిధుల బృందం అమరావతికి వెళ్లి ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందజేస్తుందని తెలిపారు.ఈ సమావేశంలో వీసీకే సీపీఐ,సీపీఎం,నాయకులు బి.శ్రీచందు, సాంబశివ, చాట్ల బయన్న,రవిశంకర్,ఆనoద్,కోటూరి మురళి,సునీల్,రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు.